దేవాలయాల అభివృద్ధి ధ్యేయం
- kranthi kumar
- Sep 10
- 2 min read
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ తో ముందుకు సాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ అన్నారు.
శనివారం మంత్రి కొండా సురేఖ వరంగల్ (తూర్పు) నియోజకవర్గంలోని ఆరు దేవాలయాలకు 4.35 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా దేశాయిపేటలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో స్వామి వారి జన్మదినం సందర్భంగా కోటి దీపాలను వెలిగించే కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని ఒత్తులు వెలిగించారు.
అనంతరం మంత్రి శ్రీమతి కొండా సురేఖ మాట్లాడుతూ మట్టేవాడ భోగేశ్వర స్వామి దేవాలయం, దేశాయిపేట రంగనాయక స్వామి దేవాలయం, కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, గోవిందరాజుల గుట్ట వద్ద ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం, కాశీ విశ్వేశ్వర రంగనాయక స్వామి దేవాలయం కాశిబుగ్గ, అబ్బని కుంట లోని మహేశ్వరి దేవాలయాల అభివృద్ధి నవీకరణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని
ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.భక్తులకు సౌకర్యార్థంగా ఉండే విధంగా ప్రణాళికబద్దంగా ఆలయాల్లో నిర్మాణాలు చేపట్టాలని, ఆలయాలకు రంగులు వేసి కొత్తదనాన్ని తీసుకోరావాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.
తూర్పు నియోజకవర్గానికి 18 దేవాలయాల అభివృద్ధి పనులకు మంజూరు చేశామని, అందులో భాగం గా నేడు ఆరు దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.మిగిలిన దేవాలయాల అభివృద్ధి పనులను త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు.
దశలవారీగా అన్ని ఆలయాల అభివృద్ధి, నవీకరణ, పునరుద్ధరణ చేయడతామని తెలిపారు.
కాతీయుల కాలం నాటి చారిత్రాత్మక దేవాలయాలు వరంగల్ లో అధికంగా ఉన్నందున వాటిని పునరుద్ధరణ చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
పురావస్తు, పర్యాటక శాఖలకు సంబంధించిన దేవాలయాలను కూడా అభివృద్ధి చేయుటకుగాను ఆయా శాఖల నుండి
అనుమతి కొరకు జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.పురావస్తు శాఖ వారి అనుమతి మంజూరైన తదుపరి ఆయా దేవాలయం అభివృద్ధి చేస్తామని, దేవదాయ శాఖకు సంబంధించిన అన్ని దేవాలయాలకు, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా తాను నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భం గా మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు రామ తేజస్వి శిరీష్ కావేటి కవిత చింతాకుల అనిల్ కుమార్ ఓని స్వర్ణలత భాస్కర్ సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ ఎండోమెంట్ అధికారి సునీత, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.










Comments